
నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన ఉషా వాన్స్.. పేరు ఏంటో తెలుసా?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ దంపతులు తమ నాలుగో సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చారు. అతడికి 'అలెక్ నీల్ వాన్స్' అని పేరు పెట్టారు. 'అలెక్' అంటే గ్రీకు మూలాలున్న 'రక్షకుడు' అని, 'నీల్' అనే పేరు సంస్కృతంలోని 'నీల' పదం నుంచి వచ్చిందని, దీనికి నీలం రంగు, ఆకాశం వంటి అర్థాలున్నాయని వివరించారు. ఉషా వాన్స్‌కు ఆంధ్రప్రదేశ్ మూలాలున్నందున 'నీల్' పేరుకు సాంస్కృతిక అనుబంధం ఉందా అనే ఆసక్తి నెలకొంది.




