మహిళల భద్రతపై రేణిగుంటలో అవగాహన సదస్సు

868చూసినవారు
మహిళల భద్రతపై రేణిగుంటలో అవగాహన సదస్సు
రేణిగుంటలోని నక్షత్ర ఫంక్షన్ హాల్‌లో మహిళలపై జరిగే నేరాల నివారణ మరియు భద్రతా చట్టాలపై భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రేణిగుంట ఎస్.డి.పి.ఓ పర్యవేక్షణలో, స్థానిక ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగంపై అధికారులు సమగ్రంగా వివరించారు. మహిళలపై వేధింపులు లేదా అన్యాయం జరిగినప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, నేరాల అదుపులో సమాజం మరియు ప్రభుత్వ శాఖల సమన్వయం కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ, రెవెన్యూ సిబ్బంది, పి.హెచ్.సి వైద్యులు, సి.డి.పి.ఓలతో పాటు ద్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్