ఏర్పేడు మండలంలోని పాత వీరాపురం గ్రామంలో 52వ శ్రీకృష్ణ ద్రౌపది ధర్మరాజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా, భీముని బకాసుర వధ ఘట్టం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, భీముని బండిలో అన్నం, కుడుములు, గుండ్రాళ్లతో బకాసురునికి ఆహారం పంపించే కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, గ్రామస్తులు నిర్వహించారు. అనంతరం, భీముడు బకాసురుడిని వధించిన సన్నివేశాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొంగర కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ ముని రంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ మునిరత్నం రెడ్డి, కావాలి బాలాజీ, కే. ఆనంద్, దొరస్వామి రెడ్డి, ఆలయ పూజారి రవి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.