శ్రీకాళహస్తి మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గ్రంథాలయ చైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి జన్మదిన వేడుకల్లో బీసీ నాయకుడు ఊరందూరు బాలాజీ పాల్గొన్నారు. ఆయన గురువారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో బీసీ ఐక్యతతో యువకులు ముందుకు రావాలని, గురువారెడ్డి బీసీ నాయకత్వంతో బీసీ కుటుంబాలకు అండగా నిలవాలని, యువకులను రాజకీయంగా ప్రోత్సహించాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నామినేట్ పదవులు బీసీలకు ఇవ్వాలని బాలాజీ పత్రికా ముఖంగా తెలియజేశారు.