
పార్లమెంట్లో పెరుగుతున్న ఎన్డీయే బలం
పార్లమెంట్ ఉభయసభల్లో ఎన్డీయే బలం పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఎగువ, దిగువ సభల్లో ఎన్డీయే బలం పుంజుకుంటోంది. ముఖ్యంగా రాజ్యసభలో 2/3 మెజారిటీకి చేరువవుతోంది. రాజ్యాంగ సవరణ బిల్లుల సమయంలో ఈ మెజారిటీ ఎన్డీయేకు ఉపయోగపడుతుంది. ఝార్ఖండ్, మిజోరంలో రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు గెలిస్తే ఎన్డీయే బలం 151కి చేరనుంది.




