శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పరిధిలోని గంగాసదన్, కైలాస సదన్ వసతి గృహాలను చైర్మన్ ప్రత్యేకంగా పరిశీలించారు. డార్మిటరీ వసతులు, శుభ్రత, మరుగుదొడ్ల పరిశుభ్రత, భక్తులకు అందే సౌకర్యాలను ఆయన సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.