శుక్రవారం, రేణిగుంటలోని ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎస్. వెంకటేశ్వర్ త్రైమాసిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈవీఎంల భద్రత, సీసీ కెమెరాలు, సీలింగ్ ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, 24 గంటల నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోడౌన్ రిజిస్టర్లో సంతకం చేశారు.