
ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. అత్యధికంగా మార్కాపురం పట్టణంలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరులో 45.1 డిగ్రీలు, ప్రకాశంలో 44.8 డిగ్రీలు, తిరుపతి, కడపలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెలువడుతున్నాయి.




