శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీరామ్ నగర్ కాలనీ యూపీహెచ్సీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బాలు డ్రైవర్లు, కండక్టర్లు, ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, తగినంత నీరు తాగాలని, ఎండలో తిరగవద్దని సూచించారు.