ఏర్పేడు(M) అంజిమేడు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని కృష్ణంపల్లికి చెందిన మునిరత్నంరెడ్డి అనే వృద్ధుడు మృతి చెందాడు. పాత వీరాపురంలో బంధువుల ఇంటికి వచ్చిన ఆయన, స్వగ్రామానికి బయలుదేరే క్రమంలో ఇసుకతాగేలి కాలనీ సమీపంలో రోడ్డు దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వైపు వెళ్తున్న వాహనం వేగంగా వచ్చి ఆయనను ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.