AP సీడ్స్ యూనిట్లో ఉత్పత్తి పెంచడంపై హర్షం

26చూసినవారు
AP సీడ్స్ యూనిట్లో ఉత్పత్తి పెంచడంపై హర్షం
ఏపీ సీడ్స్ కార్పొరేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 150 కోట్లు మంజూరు చేయడంపై టీయూసీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ యూనిట్లో ఉత్పత్తి పెంచుతామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించడం స్వాగతించదగ్గ విషయమని నాయకులు జేవీ నరసింహమూర్తి, తాలేటి రామచంద్రయ్య పేర్కొన్నారు. ఈ నిధులతో సంస్థ అభివృద్ధి చెందడంతో పాటు కార్మికుల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్