నాగలాపురం పీఎం శ్రీ ప్రభుత్వ హై స్కూల్ ప్లస్
విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో 83% ఉత్తీర్ణత సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఎం. దర్శిని 564 మార్కులతో, కే. రాజేశ్వరి 559 మార్కులతో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులుగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ఈ
ఫలితాలు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల అద్భుత ప్రతిభకు తోడ్పడిన ఉపాధ్యాయులను తల్లిదండ్రులు అభినందించారు.