ముక్కంటి సన్నిధిలో హైకోర్టు జడ్జి

5చూసినవారు
ముక్కంటి సన్నిధిలో హైకోర్టు జడ్జి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్య, తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి, రాహు కేతు పూజ, అభిషేకం, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, ఏఆర్ఓ మహేష్, స్థానిక కోర్టు ప్రోటోకాల్ జడ్జి నరసింహమూర్తి, కోర్టు పర్యవేక్షకులు రవి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :