శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడిపూడి దసరాదాచారి ఆధ్వర్యంలో పాత్రికేయుడు బాలసుబ్రమణ్యంకు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యంను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్యనిర్వహణ కార్యదర్శి ఉమేష్ రావు, పట్టణ కార్యనిర్వహక కార్యదర్శి వజ్రంకిషోర్, ఎస్సీ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ డైరెక్టర్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానపస్తునాంబ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.