దిత్వా తుఫాన్ ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల చెరువులు, వాగులు పొంగిపొర్లుతూ లోతట్టు ప్రాంతాల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. టూ టౌన్ పరిధిలోని బసవయ్యపాలెం, తెలుగు గంగ కాలువ ప్రాంతాలను సీఐ నాగార్జున రెడ్డి స్వయంగా సందర్శించి, స్థానికులను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. పోలీస్ శాఖ సహాయానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.