శ్రీకాళహస్తి రూరల్, పట్టణ పరిధిలో 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో 96 ప్రమాదాలు జరిగి 28 మంది మరణించగా, 93 మంది గాయపడ్డారు. అయితే, 2025 నవంబర్ వరకు 82 ప్రమాదాలు జరిగి 43 మంది మరణించారు, 95 మంది గాయపడ్డారు. రూరల్ ప్రాంతంలో ప్రమాదాలు అధికంగా నమోదయ్యాయి. నూతన హైవేపై ప్రయాణాలపై ప్రజలకు అవగాహన లేకపోవడమే ప్రమాదాల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.