శ్రీకాళహస్తిలో అంగన్వాడీ పోస్ట్లకు ఇంటర్వూలు

15చూసినవారు
శ్రీకాళహస్తిలో అంగన్వాడీ పోస్ట్లకు ఇంటర్వూలు
శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని శ్రీకాళహస్తి, రేణిగుంట, వెంకటగిరి ప్రాంతాల అంగన్వాడీ సహాయకుల ఎంపిక కోసం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవో భాను ప్రకాశ్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలకు శ్రీకాళహస్తి ప్రాజెక్ట్ నుంచి 41 మంది, రేణిగుంట నుంచి 31 మంది, వెంకటగిరి నుంచి 55 మంది, పిచ్చాటూరు నుంచి 56 మంది మహిళలు హాజరయ్యారు. ఎంపికైన మహిళల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆర్డీవో, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంతభాయ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్