ముక్కంటి సన్నిధిలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్

7చూసినవారు
ముక్కంటి సన్నిధిలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్
కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తన కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి బీకే వెంకటేశులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్రప్ప శెట్టి ఆయనకు సాదరంగా స్వాగతం పలికి, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి, ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఏపీఆర్ఓ రవి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్