శ్రీకాళహస్తిలో ఘనంగా లక్ష దీపోత్సవం

11చూసినవారు
కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి వైష్ణవ పుష్కరిణిలో లక్ష దీపోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి, అమ్మవార్ల చిత్రపటాలకు పూజలు నిర్వహించి ఆలయ ఈవో దీపాలు వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుష్కరిణిలో దీపాలు వెలిగించారు. వేలాది దీపాల కాంతులతో పుష్కరిణి ప్రకాశవంతంగా, శోభాయమానంగా మారి అద్భుత దృశ్యాన్ని సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్