శ్రీకాళహస్తిలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. స్థానిక న్యాయవాది వినోద్, ఆయన తండ్రిపై కొందరు దాడి చేశారని ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసు స్టేషన్‌లో సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, మల్లికార్జునయ్య, రాజేశ్వర్ రావు, ఉదయ్ పాల్గొన్నారు.