పరీక్ష చేద్దాం – మత్తును వదిలిద్దాం: డి. ఎస్. పి నరసింహమూర్తి

15చూసినవారు
పరీక్ష చేద్దాం – మత్తును వదిలిద్దాం: డి. ఎస్. పి నరసింహమూర్తి
తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డిఎస్పి నరసింహమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం చల్లపాలెం బీసీ కాలనీలో మాదక ద్రవ్యాల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనుమానితుల నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వాడకం ఆరోగ్యాన్ని క్షీణింపజేయడమే కాకుండా నేరాలకు పాల్పడేలా చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ఇబ్రహీం, ఎస్సై వెంకటేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్