హంస వాహనంపై చెన్నకేశవ స్వామి

3చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, సోమవారం రాత్రి చెన్నకేశవ స్వామిని హంస వాహనంపై గ్రామంలో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కొబ్బరికాయలు కొట్టి, హారతులు సమర్పించి స్వామివారికి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ సబ్ టెంపుల్స్ ఇంచార్జ్ లక్ష్మయ్య, దుర్గా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్