మే డే ను జయప్రదం చేయండి

0చూసినవారు
మే డే ను జయప్రదం చేయండి
శ్రీకాళహస్తిలో సిపిఎం పార్టీ కార్యాలయంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య మే డేను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చికాగో కార్మికుల త్యాగాల ఫలితంగా 8 గంటల పని విధానం సాధించుకున్నామని, కానీ ప్రస్తుతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసేలా 13 గంటల పని విధానానికి అనుమతి ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా మళ్ళీ కార్మిక ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కామేష్, వెంకటేష్, గురవయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్