శ్రీకాళహస్తిలో సిపిఎం పార్టీ కార్యాలయం కార్మికుల స్ఫూర్తి దినం మే డేను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య పిలుపునిచ్చారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో సోమవారం మే డే జయప్రదంపై సీఐటీయూ డివిజన్ నేతల సమీక్షా సమావేశం నిర్వహించారు. చికాగో కార్మికుల త్యాగాల ఫలితంగా 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నామని, అయితే నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా 13 గంటల పని విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ కార్మిక ఉద్యమం తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కామేష్, వెంకటేష్, గురవయ్య పాల్గొన్నారు.