ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ గేట్ల వద్ద క్యూఆర్ స్కాన్ ఏర్పాటు చేయడంతో, భక్తులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే స్వామివారి దర్శనం మరియు ప్రసాదాలను బుక్ చేసుకోవచ్చు. ఈ నూతన సౌకర్యం ద్వారా దర్శనాలు మరింత సులభతరం అవుతాయని ఆలయ సిబ్బంది తెలిపారు.