శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ అధికారులు భువనేశ్వరి, బాలయ్య మాట్లాడుతూ, మాతృభాషపై పట్టు సాధిస్తే ఇతర భాషలను సులువుగా నేర్చుకోవచ్చని తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆర్ పి బి ఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో
విద్యార్థులు కన్నడం, తమిళం, మలయాళం భాషల్లో సాధించిన ప్రావీణ్యతను నిష్ణాతులైన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యాశాఖాధికారులు, తల్లిదండ్రుల సమక్షంలో పరీక్షించారు. ప్రధానోపాధ్యాయులు తీగల వెంకటయ్య ఆధ్వర్యంలో 26 తెలుగు సరళ పదాలతో రూపొందించిన "తెలుగు జ్యోతి" పుస్తకం ఆధారంగా 15 మంది
విద్యార్థులు ఈ మూడు భాషల్లోనూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.