శ్రీకాళహస్తి రేణిగుంటలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి మురళీ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. కార్మికులు సమాన వేతనం, పంచాయితీ కార్మికులకు న్యాయమైన వేతనాలు, సంక్షేమ పథకాల అమలు కోరుతూ నినాదాలు చేశారు. పోరాటమే కార్మికుల శక్తి అని వారు గళమెత్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు, మహిళా కార్మికులు పాల్గొన్నారు.