
రాగల రెండు గంటల్లో రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు
AP: రానున్న రెండు గంటల్లో రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు, రైతులు చెట్లు, కరెంట్ స్తంభాలు, హోర్డింగుల వద్ద నిలబడవద్దని సూచించింది.




