పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఎంజిఎం విద్యార్థులు

6చూసినవారు
పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఎంజిఎం విద్యార్థులు
శ్రీకాళహస్తిలోని ఎంజీఎం స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. గురపాడ్ నాయక్ మరియు కే. తోషిని 589/600 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. చెంచు చితిష్ కుమార్ 588/600, కే. నివేదిత 586/600, మరియు ఎస్ జోష్నాథ్ 584/600 మార్కులు సాధించారు. మొత్తం 33 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి విజయఢంకా మోగించారు. ఎంజీఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ, మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్