బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

26చూసినవారు
బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముస్లింలు త్యాగానికి ప్రతీకగా భావించే పవిత్రమైన బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొని, కుర్బానీలు ఇచ్చే సంప్రదాయాన్ని అనుసరిస్తూ జరుపుకునే ఈ పండుగకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ, టౌన్ బ్యాంక్ చైర్మన్ ఖాదర్ భాషా, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు కరీం, ఐఐటిడిపి నియోజకవర్గ అధ్యక్షుడు ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్