శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మహిళల ఆర్థిక అభివృద్ధి, సామాజిక సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా, నేడు వెలుగు సంఘమిత్రులకు సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని 200 మంది సంఘమిత్రులకు సుమారు రూ. 37 లక్షల వ్యయంతో అత్యాధునిక మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ భవాని శంకర్, చెంచాయి నాయుడు, జహీర్ అహ్మద్, కంట రమేష్ తదితరులు పాల్గొన్నారు.