
నీట్ లీక్‌పై పార్లమెంట్లో చర్చకు సిద్ధం: జేపీ నడ్డా
నీట్ (NEET) పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్లో సుదీర్ఘ చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని ఆయన కోరారు. పరీక్షల వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనూ పేపర్ లీక్‌లు జరిగాయని గుర్తు చేస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌పై సభలోనే చర్చిద్దామని ఆయన అన్నారు.




