నరసింహ స్వామి జయంతి వేడుకలు

1చూసినవారు
నరసింహ స్వామి జయంతి వేడుకలు
శ్రీకాళహస్తిలోని భరద్వాజ తీర్థం సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలు వైశాఖ శుద్ధ చతుర్దశి సందర్భంగా కన్నుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, గంధంతో అభిషేకం చేసి పూజలు చేశారు. ఈ వేడుకలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్