తొట్టంబేడు మండలంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం

11చూసినవారు
తొట్టంబేడు మండలంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం
తొట్టంబేడు మండలం శేషమ నాయుడు కండ్రిగ గ్రామంలో 12 ఎకరాల వరి పంట వేసిన రైతుకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. నూతన 11 కేవీ త్రీ ఫేస్ విద్యుత్ లైను ఏర్పాటు చేస్తున్న సమయంలో సుమారు 5 గుంటల వరి పైరు పూర్తిగా దెబ్బతింది. విద్యుత్ వైర్లు లాగుతున్నప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంట పొలాల్లో వరి పైరు పూర్తిగా దెబ్బతిన్నదని, దీని వలన రైతుకు 20 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విద్యుత్ లైన్ పనులు చేసేటప్పుడు రైతుల పంటలకు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ శాఖదేనని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్