మహిళల ఆందోళనతో స్పందించిన అధికారులు

0చూసినవారు
మహిళల ఆందోళనతో స్పందించిన అధికారులు
తొట్టంబేడు మండలం తాటిపర్తి పంచాయతీలోని కల్లిపూడి గ్రామాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషిత దత్తత తీసుకున్నారు. మూడు రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడంతో గ్రామస్థులు, ముఖ్యంగా మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వారు వాపోయారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో, ఆయన వెంటనే అధికారులను గ్రామానికి పంపి సమస్యను పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్