ప్రజా విప్లవ నాయకుడు యన్టీఆర్‌

2చూసినవారు
ప్రజా విప్లవ నాయకుడు యన్టీఆర్‌
పేదవాడి గౌరవాన్ని పాలనలో ప్రతిబింబించిన ప్రజా విప్లవ నాయకుడు, "సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు” అన్న భావనతో ప్రజారంజక పాలన అందించిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు అని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. రాముడైనా, కృష్ణుడైనా, వెంకటేశ్వరస్వామి అయినా మనకు గుర్తొచ్చే ఒకే ఒక్క రూపం మన నందమూరి తారకరామారావు గారు అని, నేడు ఆ యుగపురుషుడి 103 వ జయంతి సందర్బంగా ఆయనను స్మరించుకుంటూ శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కూడలిలో ఆయన చిత్రపటాన్ని ఉంచి పూజలు చేసి, ఘన నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్