శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2026పై మెప్మా సభ్యులు, సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు. పౌరుల ఫీడ్ బ్యాక్ సేకరణ, హోం కంపోస్టింగ్ విధానాలను వివరించారు. పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్త వేరు చేసి, హోం కంపోస్టింగ్ను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కమిషనర్ సూచించారు.