పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెంచుతూ సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతోందని సీపీఎం శ్రీకాళహస్తి ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి విమర్శించారు. మంగళవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. నాలుగోసారి లీటరుపై రూ. 2.86 చొప్పున చమురు ధరలు పెంచడం గర్హనీయమన్నారు. నిత్య జీవితావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా చమురుపై టాక్స్‌లు తగ్గించడం లేదని ఆయన మండిపడ్డారు.