రేణిగుంట రూరల్ గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గంజాయి నిర్ధారణ
పరీక్షలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు ఈ
పరీక్షలు చేస్తున్నారు. గంజాయి వాడకం పాజిటివ్ వచ్చిన వారి ద్వారా సరఫరాదారులు, పెడ్లర్ల వివరాలు సేకరించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు.