పౌర్ణమి స్వామి అమ్మవార్ల ఊంజల సేవ

2చూసినవారు
దక్షిణ కైలాసం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శనివారం సాయంత్రం సోమ స్కంద మూర్తి, జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవమూర్తులను పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి, ఆలయ ఊరేగింపుగా కోట మండపం వద్ద ఉయ్యాలలో కొలువుదీర్చి ఊంజల సేవ నిర్వహించారు. వేద పండితులు వేదమంత్రాలు, వేద పారాయణం మధ్య దీప ధూప నైవేద్యం, అఖండ దీపారాధన, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you