సత్యవేడు నియోజకవర్గం, నాగలాపురం మండలం, సురుటుపల్లిలోని శ్రీప్రసన్నకోండేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నందీశ్వరునికి ప్రదోష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ పద్మనాభ రాజు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జరిగే ఈ పూజలకు భక్తులు పూజా సామాగ్రిని విరాళంగా అందించవచ్చు. అభిషేక పూజలో పాల్గొనే భక్తులు రూ. 500 చెల్లించి టికెట్ పొందాలని ఈవో లత కోరారు.