ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచనలతో, శ్రీకాళహస్తి పట్టణంలో పెట్రోల్ బంకు వద్ద డీజిల్ కొరతపై వైయస్సార్సీపీ నాయకులు నిరసన చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఈ నిరసనకు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో కంట ఉదయ్ శ్రీనివాసరెడ్డి, ఫరీద్ పటాన్, శ్రీవారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.