పబ్లిక్ కొళాయిలు కొనసాగించాలి

4చూసినవారు
పబ్లిక్ కొళాయిలు కొనసాగించాలి
శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పేదల మంచినీటి అవసరాలు తీర్చే పబ్లిక్ కొళాయిలను కొనసాగించాలని సీపీఎం శ్రీకాళహస్తి ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పన్నుల వసూళ్ల పేరుతో గతంలో మంచినీటి సరఫరా నిలిపివేసిన మున్సిపల్ కమిషనర్, ఇప్పుడు వృధా పేరుతో పబ్లిక్ కొళాయిలను తొలగించడం సరికాదని మణి ఆక్షేపించారు. పట్టణంలో 20 శాతం ప్రజలు ఈ కొళాయిలపైనే ఆధారపడుతున్నారని ఆయన గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్