రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈరోజు తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి, రాహు కేతు పూజలు, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి BK వెంకటేశులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు గుర్రప్ప శెట్టి, AEO విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ AEO మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, ఇన్స్పెక్టర్ సుదర్శన్, APRO రవి, జమేదార్ దామోదర్ పాల్గొన్నారు.