రేణిగుంట మండలంలోని ఎల్లమండ్యం పంచాయతీ కొత్తపాలెం గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో (RO) వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేర్చడం సంతోషంగా ఉందని, మల్లాడి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఎస్ఆర్ నిధులను ప్రజా సంక్షేమ పనులకు వినియోగించామని, నియోజకవర్గ సమస్యలను ఇదే రీతిలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.