రేణిగుంట సమీపంలో రోడ్డు ప్రమాదం

16చూసినవారు
రేణిగుంట సమీపంలో రోడ్డు ప్రమాదం
రేణిగుంట మండలం గుత్తివారిపల్లి సర్వీస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వివరాలు తెలిసినవారు సంప్రదించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్