శ్రీకాళహస్తి ఆర్‌టీఓ కార్యాలయంలో ఆర్టీవో దామోదరనాయుడు గురువారం ‘రహదారి భద్రతా మాసోత్సవాలు – 2026’ను ప్రారంభించారు. జనవరి 1 నుంచి 31 వరకు జరిగే ఈ కార్యక్రమాల లక్ష్యం ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచి, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం. “శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన” అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.