గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చెరువులు కీలకమని, నీటి సంరక్షణ పనులతో భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. శ్రీకాళహస్తి మండలంలోని గంగలపూడి చెరువు పునరుద్ధరణతో సుమారు 150 ఎకరాల సాగుకు నీరు అందుతోంది. జలధార – జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన ఈ పనుల ద్వారా చెరువు నిండడంతో బోరు బావులు, బావులు రీఛార్జ్ అవుతున్నాయి.