సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత తీవ్రంగా ఉంది. రోజుకు 150 మందికి పైగా ఓపీకి వస్తున్నప్పటికీ, అవసరమైన మందులు అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ జ్వరం, షుగర్, బీపీ వంటి వ్యాధులకు కూడా ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. రోగులు మందులు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.