దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో వారం రోజుల పాటు జరిగే చిన్న కొటాయి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున, స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపం నుండి బయలుదేరి, ఆలయ ఆవరణంలోని పగడ చెట్టు కిందకు తీసుకువచ్చి, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.